Breaking News

పదిలో మెరుగైన ఫలితాలు సాధించాలి

 

కామారెడ్డి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 10వ తరగతి ఫలితాల్లో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు మెరుగైన పలితాలు సాధించేందుకు సంక్షేమ శాఖాధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. షెడ్యుల్‌ కులాలు, వెనకబడిన తరగతుల గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహ 10వ తరగతి విద్యార్థుల పరీక్ష సన్నద్దతపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వసతి గృహంలోని విద్యార్తులకు సబ్జెక్టుల వారిగా నిష్నాతులైన ఉపాధ్యాయులచేత తర్పిదునిప్పించాలన్నారు. ఉపన్యాసాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలని పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లాలోని సంక్షేమ సిబ్బంది కృషి చేయాలన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన సంక్షేమ విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ మెడళ్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, సంక్షేమ శాఖాధికారులు దేవిదాస్‌, గంగాధర్‌, మదన్‌మోహన్‌, వసతి గృహ అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *