Breaking News

ఘనంగా కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

కామారెడ్డి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ ఆద్వర్యంలో పార్టీ కార్యాలయ ఆవరణలో కేక్‌ కట్‌ చేసి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఇందిరా గాంధీ స్టేడియంలో కామారెడ్డి,నిజామాబాద్‌ జిల్లాల అండర్‌-17 క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన సాందీపని కళాశాల జట్టుకు ట్రోఫీ బహుకరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి 131 సంవత్సరాలు పూర్తయి 132 సంవత్సరంలోకి అడుగిడిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని, సోనియాగాంధీ, షబ్బీర్‌ అలీల నాయకత్వంలో పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు, నాయకులు అశోక్‌రెడ్డి, పండ్లరాజు, నాగేశ్వర్‌రావు, ఇసాక్‌ షేరూ, కన్నయ్య, చందు, చింతల శ్రీను, జమీల్‌, శ్రీనివాస్‌, హరికిషన్‌ గౌడ్‌, సందీప్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *