Breaking News

ఘనంగా కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బీర్కూర్‌ గ్రామంలో, నసురుల్లాబద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ దివిటి శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడి నేటికి 138 సంవత్సరాలు గడుస్తుందని ఆయన అన్నారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న పార్టీని నిన్న, మొన్న పుట్టిన పార్టీలు చులకనగా మాట్లాడడం తగదని హెచ్చరించారు. ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి తెలంగాణ ఇచ్చే వరకు ప్రతి ఉద్యమంలో, ప్రతి సమస్య పరిష్కారంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుందని ఆయన తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది, చాచానెహ్రూ హయాం నుండి సోనియాగాందీ వరకు కాంగ్రెస్‌ ప్రబుత్వమేనని ఆయన అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పోగు నారాయణ, బాన్సువాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ హైమద్‌, రాచప్ప పటేల్‌, మాజీ జడ్పిటిసి కిషోర్‌ యాదవ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *