Breaking News

కార్మిక సంఘాలు, జేఏసి చర్చలు సఫలం

 

కామారెడ్డి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికుల డిమాండ్ల కోసం బీడీ యజమానులుతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు సఫలమైనట్టు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.నరేందర్‌ తెలిపారు. బుధవారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అందరికి కొత్తవేతన ఒప్పందం కోసం బీడీ యజమానులకు కార్మిక సంఘాల జేఏసికిమధ్య చర్చలు జరిగాయన్నారు. ఈ క్రమంలో బీడీ కార్మికుల వేతనాల పెంపునకు యాజమాన్యాలు ఒప్పుకున్నట్టు తెలిపారు. గతంలో 2016లో ఒప్పందం ముగిసిందని, కొత్త అగ్రిమెంట్‌ కోసం నోటిసు ఇచ్చినా యాజమాన్యాలు సహకరించలేదన్నారు. బీడీ కార్మిక సంఘాలు జేఏసిగా ఏర్పడి ఆందోళనలు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై అదనంగా నెలకు 1100 రూపాయల చొప్పున కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు వేతన పెంపునకు యాజమాన్యాలు ఒప్పుకున్నాయన్నారు. బీడీలు చుట్టే కార్మికులకు వెయ్యి బీడీలకు 4 రూపాయల చొప్పున పెంచి ఇవ్వాలన్నారు. అగ్రిమెంట్‌ 01.12.2016 నుంచి 31.05.2018 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. సమావేశంలో కార్మిక నాయకులు వనమాల కృష్ణ, బత్తిని రాజు, జితేంద్ర, ధర్మేంద్ర, జవహర్‌ షా, కట్ల భూమన్న, రాజు, గొండక్క, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *