Breaking News

కల్లోల కడలిలో రూపాయి

  • 70కి చేరుతుందంటున్న విశ్లేషకులు

భారత కరెన్సీ రూపాయి 2016 సంవత్సరంలో విదేశీ మారక విపణిలో తీవ్ర ఆటుపోట్లు చవి చూసి ప్రస్తుతం డాలర్‌ మారకంలో 69 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఎఫ్‌ఐఐలు భారీ మొత్తంలో నిధులు ఉపసంహరించడం రూపాయిని ఒత్తిడికి గురి చేస్తోంది. సెప్టెంబరు నెలలో 66.25 రూపాయల గరిష్ఠ స్థాయిని నమోదు చేసినా తదనంతర పరిణామాలతో దిగజారుతూ నవంబరులో 68.90 రూపాయల ఇంట్రాడే కనిష్ఠ స్థాయికి దిగజారింది. ఆ తర్వాత కోలుకుని మంగళవారం మార్కెట్‌ ముగిసే సమయానికి 68.06 వద్ద క్లోజయింది. గత ఏడాది ముగింపు స్థాయి 66.15తో పోల్చితే నికరంగా 2.40 శాతం నష్టపోయింది. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచడంతో పెట్టుబడులపై రాబడులు పెరుగుతాయన్న ఆశలతో ఎఫ్‌ఐఐలు ఈ ఏడాది దేశీయ మార్కె ట్‌ నుంచి రెండు వందల కోట్ల డాలర్లు (రూ.13,400 కోట్లు) ఉపసంహరించారు. దీనికి తోడు ఆర్‌బిఐ వడ్డీ రేట్లలో యథాపూర్వ స్థితిని కొనసాగించడం, నవంబరులో ఎఫ్‌సిఎన్‌ఆర్‌ డిపాజిట్ల రిడెంప్షన్‌ పరిస్థితిని మరింత గందరగోళం చేసింది. ఏడాది మొత్తం మీద ఈక్విటీ మార్కెట్‌లోకి 401 కోట్ల డాలర్ల నిధులు రాగా డెట్‌ మార్కెట్‌ నుంచి 647 కోట్ల డాలర్లు వెలుపలికి తరలిపోయాయి. కాగా డీమానిటైజేషన్‌ ప్రభావం వల్ల రానున్న రోజుల్లో రూపాయి విలువ 70ని తాకవచ్చునన్న ఊహాగానాలు సాగుతున్నాయి. మరోపక్క డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నిక కావడంతో ప్రభుత్వ వ్యయాలు పెంచుతారన్న ఆశలతో డాలర్‌ 2003 సంవత్సరం తర్వాత తొలి సారిగా అన్ని ప్రధాన కరెన్సీలతోనూ మంచి ర్యాలీ సాధించింది. అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థ గతిని మార్చుకున్న సంకేతాలు కనిపిస్తుండడంతో వడ్డీరేట్లను మరింతగా పెంచుతామన్న సంకేతాలు కూడా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించడం రూపాయిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *