Breaking News

జనవరి 31లోపు సాదాబైనామాల పరిశీలన

 

మోర్తాడ్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం అమలు చేస్తున్న సాదా బైనామాలో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను జనవరి 31 లోపు పూర్తిచేయాలని జేసి రవిందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం మోర్తాడ్‌ తహసీల్‌ కార్యాలయాన్ని సందర్శించి మండల, గ్రామ రెవెన్యూ అదికారులతో సాదా బైనామాపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఎకరాల పైఉన్న ప్రభుత్వ, అసైన్‌మెంట్‌ భూములను సాదా బైనామాలో అమలు చేయరాదన్నారు. 2014 జూన్‌ 2లోపు కొనుగోలు, విక్రయదారుల దరఖాస్తులను మాత్రమే పరిశీలించాలన్నారు. కొనుగోలు, విక్రయదారులతో చర్చించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక రూపొందించాలన్నారు. ముడుపులకు ఆశపడి సాదాబైనామాలో తప్పుడు రికార్డులు అందిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ మంజులవాణి, ఆర్‌ఐ సురేందర్‌, గ్రామ రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *