Breaking News

నగదు రహిత సమాజానికి పాటుపడాలి

 

కామారెడ్డి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు నగదు రహిత సమాజం కోసం పాటుపడాలని జిల్లా ట్రైబల్‌ వెల్పేర్‌ అధికారి గంగాదర్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలలోబుధవారం నగదు రహిత లావాదేవీలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార లావాదేవీల్లో స్వైపింగ్‌యంత్రాలు వాడాలని, మోబైల్‌ బ్యాంకింగ్‌పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆంధ్రాబ్యాంక్‌ జోనల్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోబైల్‌ బ్యాంకింగ్‌ వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. విద్యార్థులకు ప్రొజెక్టర్‌ ద్వారా మోబైల్‌ బ్యాంకింగ్‌ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిజెడబ్ల్యు ఎవో దేవేందర్‌, ఆంధ్రాబ్యాంకు జోనల్‌ కంప్యూటర్‌మేనేజర్‌ సదాశివ సాంబ, చీఫ్‌ మేనేజర్‌ సీతారాములు, కళాశాల సిఇవో హరిస్మరణ్‌రెడ్డి, డైరెక్టర్‌ బాలాజీరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డిలో స్వాగత తోరణం

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో ప్రధాన రహదారి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *