Breaking News

సారూ… పింఛన్‌ అందించండి…

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతినెల అందించే పింఛన్‌ తమకు నేటికి అందడం లేదని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ మాగి గ్రామానికి చెందిన వృద్దులు, వితంతువులు మండల పరిషత్‌ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. ప్రతినెల పింఛన్‌ డబ్బులు అందించే పోస్టాఫీసులో బిపిఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపిడివో రాములు నాయక్‌కు విన్నవించారు. రెండునెలల పింఛన్‌ డబ్బులు ఒకేసారి ఇస్తున్నారని వాపోతున్నారు. పోస్టాఫీసు సిబ్బందితో మాట్లాడి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎంపిడివో సూచించారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *