Breaking News

రాబోవు వర్షాకాలానికి టేకు మొక్కలు సిద్దం చేయండి

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోవు వర్షాకాలానికి టేకు మొక్కలుసిద్దం చేయించాలని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మైలారం, మిర్జాపూర్‌, బీర్కూర్‌ గ్రామాల్లో టేకు మొక్కల పెంపకాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. రాబోవు వర్షాకాలానికి మూడు లక్షల టేకు మొక్కల పెంపకంలక్ష్యంతో మొక్కలు పెంచుతున్నామని, రైతులకు ప్రధాన రహదారిపై మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. టేకు మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం తగదని, నర్సరీ దారులకు ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎపివో అక్మల్‌, సర్పంచ్‌ సాయిరాం యాదవ్‌, తదితరులున్నారు.

Check Also

ప్రభుత్వం ప్రకటించే వరకు రైతులు వరి సీడ్‌ కొనవద్దు

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రాబోయే వానాకాలంలో వ్యవసాయంపై సంబంధిత అధికారుల‌తో జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *