Breaking News

రోబోను పెళ్లాడనున్న యువతి

ఫ్రాన్స్:రజనీకాంత్ నటించిన ‘రోబో’ సినిమా చూశారా..? మనసున్న రోబో హీరోయిన్‌‌పై మనసు పడటం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేది ఆ సినిమా వృత్తాంతం. అయితే ఇక్కడ రోబో కాదు కానీ.. ఓ యువతి ప్రేమలో పడింది. త్వరలో రోబోను పెళ్లి చేసుకుంటానంటూ ఓ ఫ్రెంచ్ మహిళ ట్విటర్‌లో పెట్టిన పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 3డీ ప్రింటెడ్ ఇన్‌మూవ్ రోబోతో తాను ఏడాదిగా గడుపుతున్నానని తెలిపింది. అయితే ఆమె పెట్టిన పోస్ట్‌పై విమర్శలు వచ్చిపడుతుండటంతో వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. తానేమీ సమాజానికి హాని చేయడం లేదనీ, తన ఇష్టం వచ్చినట్లు తాను ఉంటున్నానని ఆమె తెలిపింది. ఏడాదిగా ఇదే రోబోతో శృంగారంలో కూడా పాల్గొంటున్నానని, పెళ్లి చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించింది. ఆమె కామెంట్స్‌పై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆమె అకౌంట్‌ను డిలీట్ చేసింది. రోబో-మనిషి మ్యారేజీలను చట్టబద్దం చేయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేస్తోంది.

 

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *