Breaking News

నేడు మండల పూజా మహోత్సవం

 

కామారెడ్డి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిఅయ్యప్పస్వామి దేవాలయంలో గురువారం మండల పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు చీల ప్రభాకర్‌ తెలిపారు. బుధవారం మండలపూజకు సంబంధించినకరపత్రాలను కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహాగణపతి, సుదర్శన హోమం, శ్రీధర్మశాస్త, పరిహార దేవతల మూలమంత్ర హోమం, సహస్ర కలశాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాలకు అయ్యప్పస్వామి ప్రధాన అర్చకులు ఉన్ని కృష్ణన్‌తోపాటు పలువురు స్వాములు హాజరుకానున్నట్టు తెలిపారు. స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ముప్పారపు ఆనంద్‌,సేవాసమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

మాజీ ఎమ్మెల్సీని పరామర్శించిన మాజీ ఎంపి కవిత

బాన్సువాడ, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ నేత అరికెల‌ నర్సారెడ్డి మాతృమూర్తి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *