Breaking News

సమాజమంతా రైతులమీదే ఆధారపడి ఉంది

 

గాంధారి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజమంతా వ్యవసాయంపై, రైతులపైనే ఆధారపడి ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం గాంధారి మండల కేంద్రంలోని హరాలే గార్డెన్స్‌లో రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్‌ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దీరుబాయి అంబాని జన్మదినాన్ని పురస్కరించుకొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి సంఘ జీవిఅని, రైతే రాజు అని మనుషులకు సంఘాలు ఉన్నాయి కానీ, రైతులకు లేవన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదురొడ్డి నిలిచేవాడు రైతు అన్నారు. సంఘం బలంగా ఉన్నపుడే మనిసి బలంగా ఉంటాడని, సంఘం బలహీనమైనపుడు మనిషి తనను తాను బలహీనమవుతాడన్నారు. ప్రతి గ్రామంలో రైతులు సంఘాలుగా ఏర్పడి వ్యవసాయంలో గాని, పరస్పర సహకారంతో అభివృద్దిలో నిలవాలన్నారు. మండలంలోని 13 గ్రామ సంఘాల రైతులు వారి వారి గ్రామాల్లో సంఘటితంగా కలిసికట్టుగా పనిచేసి వ్యవసాయంలో అభివృద్ది చెందుతున్నారన్నారు.

రిలయన్స్‌ ఫౌండేషన్‌ అలాంటి గ్రామాలను దత్తత తీసుకొని రైతులకు వ్యవసాయంలో మెళకువలు నేర్పిస్తూ వారి అభివృద్దికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ఇదేవిధంగా మరిన్ని గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ది చేయాలని రిలయన్స్‌ఫౌండేషన్‌ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో రైతుల సమస్యలు, మహిళల సమస్యలపై స్పందించడానికి టోల్‌ ప్రీ నెంబర్‌ ఆవిష్కరించారు. 1800 419 8800 అనే నెంబరు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎప్పుడు ఫోన్‌ చేసినా రైతాంగ సమస్యలు, మహిళల సమస్యలపై సమాదానం వస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జేసి సత్తయ్య, వ్యవసాయ జెడిఎ శ్రీనివాస్‌రావు, ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, గాంధారి జడ్పిటిసి తానాజీరావు, ఎంపిపి యశోదాబాయి ఎఎంసి ఛైర్మన్‌ గీతా, శ్రీకాంత్‌రెడ్డి, ఐసిడిఎస్‌ పిడి రాధమ్మ, స్థానిక సర్పంచ్‌సత్యం, ఎడిఎ యాదగిరి, కామారెడ్డి రిలయన్స్‌ ఫౌండేషన్‌ పిడి రాజేశ్‌, బాపురావు, తెరాస నాయకులు శివాజీరావు, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఆయా శాఖల అధికారులు తదితరులున్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *