Breaking News

నగదు రహిత లావాదేవీల కోసం మహిళా సంఘాలు కృషి చేయాలి

 

కామారెడ్డి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గ్రామంలో ఇకనుంచి నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు ప్రతి మహిళా సంఘ సభ్యురాలు కృషి చేయాలని కామారెడ్డి ఎంపిడివో చిన్నారెడ్డి మహిళా సమాఖ్య ఏరియా కో ఆర్డినేటర్‌ రవిందర్‌రావులు కోరారు. కామారెడ్డి మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యుల సమావేశం బుధవారం మండల సమాఖ్య భవనంలో .నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని, బడ్డి, రుపేకార్డు, డెబిట్‌ కార్డు లాంటివి తీసుకొని వాటి ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపాలని, సాధ్యమైనంత త్వరగా దీన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. సభ్యురాలి స్థాయి నుంచే నగదు రహిత లావాదేవీలు జరపాలని ఇందుకోసం పటిష్టవంతమైన బుక్‌ కీపింగ్‌ వ్యవస్థను నెలకొల్పాలన్నారు. మండలంలో ఆసక్తిగల ఒక గ్రామ పంచాయతీకి పెరటి కోళ్ల పెంపకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా ఎదగడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్త్రీనిధి ఎజిఎం శ్రీనివాస్‌, మేనేజర్‌ మోయిద్‌, ఎపిఎం శ్రీనివాస్‌, సిసిలు రాందాస్‌, తదితరులున్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *