Breaking News

Daily Archives: December 29, 2016

ఉద్యానశాఖ పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో ఉద్యానశాఖ రైతుల కోసం చేపడుతున్న పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో గురువారం ఉద్యానశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పండ్ల తోటల విస్తీర్ణ పథకం, నీటి గుంటలు, ప్యాక్‌ హౌజ్‌, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, శాశ్వత పందిళ్ళు, మినీ కిడ్స్‌, ప్లాస్టిక్‌ క్రేడ్స్‌, మల్చింగ్‌, పాలి హౌజ్‌ పథకాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ...

Read More »

బడి బయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడి బయటి పిల్లలను, బాల కార్మికులను గుర్తించి వారిని పాఠశాలలు, వసతి గృహాల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఆపరేషన్‌ స్మైల్‌-3 సందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్‌లో ఎస్‌పి శ్వేతతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31, 2017 వరకు ఆపరేషన్‌ స్మైల్‌-3 కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. దీనికి ...

Read More »

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో డిక్షనరీల పంపిణీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలోగురువారం కామారెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 70 డిక్షనరీలను అందజేశారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు పి.సత్యం కూతురు వివాహాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీచేసినట్టు తెలిపారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాద్యాయుడు మాట్లాడుతూ రోటరీ క్లబ్‌ ఆద్వర్యంలో చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ప్రశంసించారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమూర్తి, లక్ష్మినర్సింలు, కోశాదికారి సత్యం, ప్రతినిదులు డాక్టర్‌ బాల్‌రాజు, ధనుంజయ్‌, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More »

అయ్యప్ప ఆలయంలో వైభవంగా పూజలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో గురువారం 27వ మండల పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మండల పూజను పురస్కరించుకొని మొదటిరోజున గణపతి హోమం, సుదర్శనహోమం, కళశ స్థాపన, అయ్యప్పస్వామికి నెయ్యాబిషేకం,అష్టాభిషేకం నిర్వహించారు. అనంతరం పడిపూజ, మంగళహారతితో ఘనంగా పూజలు చేశారు. స్వాములు సామూహిక అర్చనల్లో పాల్గొన్నారు. శబరిమలై సహ అర్చకులు ఉన్ని కృష్ణన్‌, నంబుద్రి, ఆలయ అర్చకుడు శివకుమార్‌, వేద పాఠ నిర్వాహకుడు రాధాకృష్ణస్వామిలు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ...

Read More »

గాంధీ విగ్రహానికి వినతి పత్రం

  కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పేర్కొంటూ కామరెడ్డి యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువారం జాతిపిత మహాత్మాగాంది విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డులో ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. బుధవారం కామారెడ్డి జిల్లాకేంద్రంలో జరిగిన సంఘటన దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఆంజనేయులు ఒకే వాహనంపై వెళుతున్న ముగ్గురిని ఆపి చలాన్‌ ...

Read More »

ప్రజాప్రతినిధుల తీరుకు నిరసనగా బంద్‌

  గాంధారి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల డివిజన్‌ మార్పుపై స్థానిక ప్రజాప్రతినిదుల వైఖరికి నిరసనగా జేఏసి ఆద్వర్యంలో గురువారం గాంధారి బంద్‌ నిర్వహించారు. బుధవారం జేఏసి నాయకులకు, స్థానికతెరాస ప్రజాప్రతినిధులకు మధ్య జరిగిన వాగ్వాదంలో తెరాస నాయకులు మండలం, డివిజన్‌ మార్పుపై ఎలాంటి వైఖరి ప్రకటించకపోగా జేఏసి నాయకులపైనే దౌర్జన్యం చేయడాన్ని ఖండిస్తూ గురువారం గాంధారి బంద్‌కుపిలుపునిచ్చారు. బంద్‌ సందర్భంగా గాంధారిలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసిఉంచారు. ధర్నా కార్యక్రమం చేపట్టారు. గాంధారి మండలాన్ని యధావిధిగా ...

Read More »

నగదు రహితంపై అవగాహన కలిగి ఉండాలి

  గాంధారి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలందరు నగదు రహితంపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గురువారం గాంధారి మండలంలోని మాదవపల్లి గ్రామంలో గ్రామస్తులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.నోట్ల రద్దు ప్రభావంతో ఇకనుంచి అందరు నగదు రహిత లావాదేవీలే కొనసాగించాలన్నారు. దీని కొరకు మోబైల్‌ ఫోన్లు, ఎటిఎంలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు ఉపయోగించుకోవాలన్నారు. వీటినిఉపయోగించే విధానాన్ని మండలానికి చెందిన బ్యాంకర్లు వివరిస్తారని, దీనిపై ...

Read More »

పేదలకు దుప్పట్ల పంపిణీ

  నందిపేట, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జమాతె ఇస్లామి హింద్‌ నందిపేట ఆద్వర్యంలో నందిపేట మండలానికి ఆనుకొని ఉన్న నాళేశ్వర్‌ గ్రామంలో గురువారం నిరుపేదలకు చలికాలం సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేశారు. మానవసేవయే మాధవ సేవగా భావించి జమాతె ఇస్లామి హింద్‌ దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగానే పేదలకు దుప్పట్లపంపిణీ, వంటసామగ్రి పంపిణీ లాంటివి చేస్తుందని వక్తలు తెలిపారు. నాళేశ్వర్‌ గ్రామంలో 30 మంది హిందు, ముస్లింలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సింగ్‌రావు, లాల్‌ ...

Read More »

మోర్తాడ్‌కు రైలొచ్చిందోచ్‌…

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కాంగ్రెస్‌ పాలనలో నత్తనడకన సాగిన రైల్వే పనులను కేంద్రంలోని ప్రధాని, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, మంత్రి బండారు దత్తాత్రేయ, రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు ప్రత్యేక చొరవ తీసుకొని అధిక నిధులు కేటాయించడమే గాకుండా పనులు సైతం పూర్తయ్యేలా చర్యలు చేపట్టడం వల్ల మోర్తాడ్‌కు రైలు చేరుకుందని బిజెపి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ అన్నారు. గురువారం జగిత్యాల్‌ వద్దగల లింగంపేట్‌ స్టేషన్‌ నుంచి 12.45 గంటలకు బయల్దేరిన పెద్దపల్లి-నిజామాబాద్‌ డెమో రైలు ...

Read More »

అచ్చేదిన్‌ ఎప్పుడు…

  -డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ నందిపేట, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం పాత్రికేయుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ మాట్లాడారు. పాత 500, 1000 నోట్లు రద్దుచేసి 50 రోజులు గడుస్తున్నా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గడం లేదని, అచ్చేదిన్‌ ఎప్పుడు వస్తాయని ప్రశ్నించారు. గతంలో పార్లమెంటులోచేసిన భూసేకరణ చట్టాన్ని దారంలేని బొంగరం వలే చట్టం చేశారని, నిండు అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడడం ఆయన ...

Read More »

ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామాల ఉపాధి కూలీలకు 150 రోజుల పనిదినాలు కల్పించాలని మండల అభివృద్ది భరత్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని మండల అబివృద్ది కార్యాలయంలోగురువారం ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షించారు. ఖచ్చితంగా ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని, ముందుగా పనులను గుర్తించి కూలీలను సిద్దం చేయాలని అన్నారు. ఖరీఫ్‌ నాట్లను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ప్రతి రోజు, ప్రతి గ్రామంలో పని కల్పించాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని ...

Read More »

నర్సరీ మొక్కలు కాపాడండి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో మైలారం, మిర్జాపూర్‌, బీర్కూర్‌ గ్రామాల్లో 2017 సంవత్సరం వర్షా కాలం నాటికి రైతులకు మొక్కలు నాటడానికి 3 లక్షల టేకుమొక్కలు పెంచుతున్నామని, వాటిని వచ్చే వర్షాకాలానికి అందుబాటులో ఉంచేలా ఏజెన్సీ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ అన్నారు. ఆయా మండలాల్లోని నర్సరీ మొక్కల పెంపకాలను గురువారం ఆయన పరిశీలించారు. 2016లో హరితహారం విజయవంతమైందని, 2017లో మండలంలో మొక్కలు నాటేందుకు 3 లక్షల మొక్కలు అందుబాటులోకి తెస్తున్నట్టు ...

Read More »

పిఆర్‌టియు క్యాలెండర్‌ ఆవిస్కరణ

  బీర్కూర్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో గురువారం మండల విద్యాధికారి గోపాల్‌రావు ఆద్వర్యంలో 2017 సంవత్సర నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఆర్‌టియు జిల్లా కార్యదర్శి రవిందర్‌ జెట్టి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో పిఆర్‌టియు ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

రాజీనామా వెనుక ఆంతర్యం?

దేశంలో రాజకీయకారణాలతోకొందరు తమతమ పదవులనుంచి వైదొలుగుతుంటే మరికొందరు పాలకుల మైండ్‌గేమ్‌తో అసహనంపెరిగి తమ పాతవృత్తులనే ఎంచుకుని తప్పుకునేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఈ దిశగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ రాజీనామా మరోసారి ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. గతంలో ఆర్‌బిఐగవర్నర్‌గా రఘురామ్‌రాజన్‌ పదవినుంచి దిగిపోయినవైనం ఎంత సంచలనానికి దారితీసిందో ప్రస్తుతం నజీబ్‌ జంగ్‌ రాజీనామా కూడా అంతేప్రకంపనలు సృష్టించిందని చెప్పాలి. దేశరాజధాని ఢిల్లీ కేంద్రపాలితప్రాంత రాష్ట్రంలో పాలకపార్టీకి కంటిమీ ద కునుకులేకుండాచేసిన వ్యక్తిగా నజీబ్‌జంగ్‌ పేరుతెచ్చు కున్నవ్యక్తి. ఢిల్లీప్రభుత్వ లెఫ్టినెంట్‌గవర్నర్‌గా ఆమ్‌ ఆద్మీ పార్టీతో ...

Read More »

అత్యంత ఖరీదైన.. న్యూఇయర్ పార్టీ ఎంట్రీ ఎంతో తెలుసా?

దుబాయ్: కొత్త సంవత్సరం 2017కు స్వాగతం పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 31 రాత్రి జరగబోయే పార్టీ కోసం ఏ రెస్టారెంటైతే బావుంటుందని, ఎంత ఖర్చు పెట్టాలనే అంశాలపై యువత భారీ స్థాయిలో చర్చించుకుంటున్నారు. ఎవరు ఎంత ఖర్చు పెట్టినా ఒకచోట జరగబోయే పార్టీ ఎంట్రీకి ఒక్కో వ్యక్తికి ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన దుబాయ్‌లోని ఓ మాల్‌లో న్యూఇయర్ వెల్‌కమ్ పార్టీకి అన్నీ ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఒక్కో వ్యక్తి భారీగా రూ.41,000 చెల్లిస్తే ...

Read More »

పవన్‌కల్యాణ్‌ సినిమాలో ఖుష్బూ

సీనియర్‌ తార ఖుష్బూ తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఓ తెలుగు సినిమాకు సంతకం చేశారు. పవనకల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ రూపొందించనున్న సినిమాలో ఆమె నటించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా ఆమె తెలియజేశారు. ‘‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఓ తెలుగు సినిమాని చేస్తున్నానని అధికారికంగా ప్రకటిస్తున్నా. త్రివిక్రమ్‌, పవన్ కల్యాణ్‌ కలిసి చేస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రంలో చేయబోతున్నా’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. ఆ సినిమా కోసం త్రివిక్రమ్‌ బ్రిలియంట్‌ స్ర్కిప్ట్‌ తయారుచేశారన్నారు. ‘‘నాది చాలా పవర్‌ఫుల్‌ కేరక్టర్‌. మెగాస్టార్‌ చిరంజీవితో నా ...

Read More »

ఆడవారికి మగవాడి అవసరం అందుకే..: ప్రియాంక!

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లో తన సత్తా చాటుతోంది. హాలీవుడ్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘క్వాంటికో’లో మెరిసిన ప్రియాంక ఇప్పుడు ఏకంగా ‘బేవాచ్‌’లో విలన్‌ పాత్ర దక్కించుకుంది. తాజాగా అసోం టూరిజం ప్రచారకర్తగా నియమితురాలైంది ప్రియాంక. ఈ సందర్భంగా మీడియాతో ఫెమినిజం గురించి మాట్లాడిన ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ స్వయం సాధికారత సాధిస్తున్నారని, మగవాడిపై ఆధారపడి బతికే రోజులు పోయాయని వ్యాఖ్యానించింది. కేవలం శృంగార అవసరం తీర్చుకునేందుకే ఆడవారికి మగవారితో పని అని ...

Read More »

పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే!

పాత నోట్లపై కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది. 2017 మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా కేంద్రం కొత్త ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది.. ఈ మేరకు ఆర్డినెన్స్ను కేంద్రం నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించింది. డిసెంబర్ 30 తర్వాత పాతనోట్లతో లావాదేవీలు జరిపినా రూ.5వేల వరకు జరిమానా విధించేలా ఈ ఆర్డినెన్స్ను ప్రభుత్వం రూపొందించింది. దీంతో పాత నోట్లు కలిగి ఉన్నవారికి గట్టి హెచ్చరికలనే ప్రభుత్వం పంపినట్టు తెలిసింది. డిసెంబర్ 30 తర్వాత కూడా పాత ...

Read More »

వారితో సెల్ఫీ తీసుకోండి.. రూ.500 గెలుచుకోండి

బుల్దానా: ఓ గ్రామ పంచాయితీ వినూత్న ఆఫర్ వెల్లడించింది. వారితో సెల్ఫీ తీసుకోండి.. రూ.500 గెలుచుకోండని ప్రకటించింది. మహారాష్ట్ర బుల్దానా జిల్లాలోని ఛాండోల్ గ్రామం ఆరుబయట మలవిసర్జనను పూర్తిగా అరికట్టేందుకు ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అలాంటి వ్యక్తులతో సెల్ఫీ తీసుకున్న వారికి రూ.500 బహుమతిగా ఇస్తామని పేర్కొంది. ఆరుబయట మలవిసర్జన చేసేవారు ఇలాగైనా సిగ్గుతో మారతారని భావిస్తోంది. స్వచ్ఛ్ భారత్‌లో భాగంగా 2017 ఏప్రిల్ నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

Read More »

ఉప్పు నుంచి వాట్సప్ దాకా అన్నీ అబద్ధాలే…

న్యూఢిల్లీ: ఉప్పు నుంచి వాట్సప్ దాకా… ఆర్బీఐ మొదలు ప్రధాని వరకు ఈ ఏడాది షికార్లు చేయని పుకార్లు లేవు. వాట్సప్ సహా ఇతర సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి చివరికి ప్రసార మాధ్యమాల్లోకి వచ్చి మీడియాలో హల్‌చల్ సృష్టించాయి. యునెస్కో, ఆర్బీఐ వంటి సంస్థలతో పాటు ఇంటర్నెట్ దిగ్గజాలైన ఫేస్‌బుక్, గూగుల్ వంటి బడా కంపెనీలు పుకార్ల ధాటికి దిగివచ్చి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియా కంపెనీలకు అతిపెద్ద మార్కెట్‌లలో భారత్ కూడా ఒకటి. మనదేశంలో 16 కోట్ల మంది వాట్సప్ ...

Read More »