Breaking News

పేదలకు దుప్పట్ల పంపిణీ

 

నందిపేట, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జమాతె ఇస్లామి హింద్‌ నందిపేట ఆద్వర్యంలో నందిపేట మండలానికి ఆనుకొని ఉన్న నాళేశ్వర్‌ గ్రామంలో గురువారం నిరుపేదలకు చలికాలం సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేశారు. మానవసేవయే మాధవ సేవగా భావించి జమాతె ఇస్లామి హింద్‌ దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగానే పేదలకు దుప్పట్లపంపిణీ, వంటసామగ్రి పంపిణీ లాంటివి చేస్తుందని వక్తలు తెలిపారు. నాళేశ్వర్‌ గ్రామంలో 30 మంది హిందు, ముస్లింలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సింగ్‌రావు, లాల్‌ మహమ్మద్‌,నందిపేట కన్వీనర్‌ షేక్‌ గౌస్‌, నాయకులు రఫీ, ఫారూఖ్‌, అహ్మద్‌ ఖాన్‌, ఇలియాస్‌, అమన్‌, మౌలానా అస్లాం తదితరులున్నారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *