Breaking News

ప్రజాప్రతినిధుల తీరుకు నిరసనగా బంద్‌

 

గాంధారి, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల డివిజన్‌ మార్పుపై స్థానిక ప్రజాప్రతినిదుల వైఖరికి నిరసనగా జేఏసి ఆద్వర్యంలో గురువారం గాంధారి బంద్‌ నిర్వహించారు. బుధవారం జేఏసి నాయకులకు, స్థానికతెరాస ప్రజాప్రతినిధులకు మధ్య జరిగిన వాగ్వాదంలో తెరాస నాయకులు మండలం, డివిజన్‌ మార్పుపై ఎలాంటి వైఖరి ప్రకటించకపోగా జేఏసి నాయకులపైనే దౌర్జన్యం చేయడాన్ని ఖండిస్తూ గురువారం గాంధారి బంద్‌కుపిలుపునిచ్చారు. బంద్‌ సందర్భంగా గాంధారిలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసిఉంచారు. ధర్నా కార్యక్రమం చేపట్టారు. గాంధారి మండలాన్ని యధావిధిగా కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని చేపట్టిన దీక్షలు గురువారంనాటికి 88వ రోజుకు చేరుకున్నాయి. కార్యక్రమంలో జేఏసి ప్రతినిధులు పోతంగల్‌ కిషన్‌రావు, తూరుపు రాజులు, సంగని బాలయ్య, బాల్‌రాజ్‌, లయన్‌ రమేశ్‌, గడా శంకర్‌, శంషోద్దీన్‌, మజార్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *