Breaking News

బడి బయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

 

– జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ

కామారెడ్డి, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడి బయటి పిల్లలను, బాల కార్మికులను గుర్తించి వారిని పాఠశాలలు, వసతి గృహాల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఆపరేషన్‌ స్మైల్‌-3 సందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్‌లో ఎస్‌పి శ్వేతతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31, 2017 వరకు ఆపరేషన్‌ స్మైల్‌-3 కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. దీనికి స్వచ్చంద సంస్థలు తోడ్పాటునందించాలని కోరారు. బడిబయట పిల్లలు, కార్మికులను ఎవరైనా గుర్తిస్తే హెల్ప్‌ డెస్క్‌ నెంబరు 100 1098కు తెలియపరచాలని కోరారు. పిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారిని విద్యావంతులు చేయాల్సిన బాద్యత అధికారులపై ఉందని, ఇందుకు అందరు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రాధమ్మ, జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, మహిళా వికలాంగుల జిల్లా సంక్షేమాధికారి చంద్రమోహన్‌రెడ్డి, రూరల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి మదన్‌మోహన్‌తోపాటు ఆయా స్వచ్చంద సంస్థల ప్రతినిదులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *