Breaking News

ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలి

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామాల ఉపాధి కూలీలకు 150 రోజుల పనిదినాలు కల్పించాలని మండల అభివృద్ది భరత్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని మండల అబివృద్ది కార్యాలయంలోగురువారం ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షించారు. ఖచ్చితంగా ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని, ముందుగా పనులను గుర్తించి కూలీలను సిద్దం చేయాలని అన్నారు. ఖరీఫ్‌ నాట్లను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ప్రతి రోజు, ప్రతి గ్రామంలో పని కల్పించాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎపివో అక్మల్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తదితరులున్నారు.

Check Also

ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద అన్నదానం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెల్ప్‌ టు అదర్స్‌ సంస్థ ఆద్వర్యంలో ఇందల్వాయి టోల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *