Breaking News

ఉద్యానశాఖ పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలి

 

కామారెడ్డి, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో ఉద్యానశాఖ రైతుల కోసం చేపడుతున్న పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో గురువారం ఉద్యానశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పండ్ల తోటల విస్తీర్ణ పథకం, నీటి గుంటలు, ప్యాక్‌ హౌజ్‌, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, శాశ్వత పందిళ్ళు, మినీ కిడ్స్‌, ప్లాస్టిక్‌ క్రేడ్స్‌, మల్చింగ్‌, పాలి హౌజ్‌ పథకాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు సూచించిన 160 హెక్టార్లకు గాను ఇంతవరకు 102 హెక్టార్లలో పండ్ల తోటల విస్తీర్ణం జరిగిందని, మిగతా 58 హెక్టార్లలో పండ్ల తోటల ప్లాంటేషన్‌ పూర్తిచేయాలన్నారు. జిల్లాలో పండ్ల తోటలు, కూరగాయలపెంపకానికి అధికారులు రైతులకు సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద రైతులకు కూరగాయల విత్తనాలను 50 శాతం సబ్సిడీ కింద సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. శాశ్వత పందిళ్ల నిర్మాణం ద్వారా తీగరకం కూరగాయలను రైతులు అధికంగా సాగు చేసి రాబడి పొందాలని సూచించారు. ఇందుకోసం 50 శాతం రాయితీ ద్వారా 2.5 ఎకరాలకు 2.50 లక్షల వరకు రాయితీ పొందవచ్చని చెప్పారు. నాణ్యత గల విత్తనాల చిన్న ప్యాకెట్లను రైతులు 25 శాతం రాయితీతో పొందవచ్చన్నారు. రైతులకు 25 శాతం రాయితీపై బుట్టలను సరఫరా చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి శేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *