Breaking News

అయ్యప్ప ఆలయంలో వైభవంగా పూజలు

 

కామారెడ్డి, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో గురువారం 27వ మండల పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మండల పూజను పురస్కరించుకొని మొదటిరోజున గణపతి హోమం, సుదర్శనహోమం, కళశ స్థాపన, అయ్యప్పస్వామికి నెయ్యాబిషేకం,అష్టాభిషేకం నిర్వహించారు. అనంతరం పడిపూజ, మంగళహారతితో ఘనంగా పూజలు చేశారు. స్వాములు సామూహిక అర్చనల్లో పాల్గొన్నారు. శబరిమలై సహ అర్చకులు ఉన్ని కృష్ణన్‌, నంబుద్రి, ఆలయ అర్చకుడు శివకుమార్‌, వేద పాఠ నిర్వాహకుడు రాధాకృష్ణస్వామిలు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు, స్వాములకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చీల ప్రభాకర్‌, ప్రతినిదులు ఉదయ్‌, పుల్లురు సతీస్‌, ప్రభాకర్‌గౌడ్‌, పంపని శ్రీనివాస్‌,రమేశ్‌, లక్ష్మణ్‌, ఆనంద్‌, రాజేందర్‌, కూర శ్రీనివాస్‌, భక్తులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *