Breaking News

నర్సరీ మొక్కలు కాపాడండి

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో మైలారం, మిర్జాపూర్‌, బీర్కూర్‌ గ్రామాల్లో 2017 సంవత్సరం వర్షా కాలం నాటికి రైతులకు మొక్కలు నాటడానికి 3 లక్షల టేకుమొక్కలు పెంచుతున్నామని, వాటిని వచ్చే వర్షాకాలానికి అందుబాటులో ఉంచేలా ఏజెన్సీ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ అన్నారు. ఆయా మండలాల్లోని నర్సరీ మొక్కల పెంపకాలను గురువారం ఆయన పరిశీలించారు. 2016లో హరితహారం విజయవంతమైందని, 2017లో మండలంలో మొక్కలు నాటేందుకు 3 లక్షల మొక్కలు అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు.

Check Also

ప్రభుత్వం ప్రకటించే వరకు రైతులు వరి సీడ్‌ కొనవద్దు

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రాబోయే వానాకాలంలో వ్యవసాయంపై సంబంధిత అధికారుల‌తో జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *