Breaking News

అత్యంత ఖరీదైన.. న్యూఇయర్ పార్టీ ఎంట్రీ ఎంతో తెలుసా?

దుబాయ్: కొత్త సంవత్సరం 2017కు స్వాగతం పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 31 రాత్రి జరగబోయే పార్టీ కోసం ఏ రెస్టారెంటైతే బావుంటుందని, ఎంత ఖర్చు పెట్టాలనే అంశాలపై యువత భారీ స్థాయిలో చర్చించుకుంటున్నారు. ఎవరు ఎంత ఖర్చు పెట్టినా ఒకచోట జరగబోయే పార్టీ ఎంట్రీకి ఒక్కో వ్యక్తికి ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన దుబాయ్‌లోని ఓ మాల్‌లో న్యూఇయర్ వెల్‌కమ్ పార్టీకి అన్నీ ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఒక్కో వ్యక్తి భారీగా రూ.41,000 చెల్లిస్తే పార్టీకి వెళ్లే అవకాశం లభిస్తుంది. దుబాయ్ కరెన్సీలో 2240 దినార్లుగా మాల్ యాజమాన్యం ప్రకటించింది. ప్రపంచంలోని జరగనున్న అన్నీ న్యూఇయర్ పార్టీ ఎంట్రీల కంటే ఇదే అధికమని వార్తలు వెలువడుతున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగే పార్టీల కంటే ఇదే అధికమని పేర్కొంటున్నారు. ఇంతలా డబ్బులు వసూలు చేస్తున్న ఈ పార్టీలో అన్నీ రకాల వంటకాలు, తాగినన్ని రకాల వైన్స్, మత్తెక్కించె మ్యూజిక్, సకల సౌకర్యాలు కల్పించనున్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *