Breaking News

నగదు రహితంపై అవగాహన కలిగి ఉండాలి

 

గాంధారి, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలందరు నగదు రహితంపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గురువారం గాంధారి మండలంలోని మాదవపల్లి గ్రామంలో గ్రామస్తులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.నోట్ల రద్దు ప్రభావంతో ఇకనుంచి అందరు నగదు రహిత లావాదేవీలే కొనసాగించాలన్నారు. దీని కొరకు మోబైల్‌ ఫోన్లు, ఎటిఎంలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు ఉపయోగించుకోవాలన్నారు. వీటినిఉపయోగించే విధానాన్ని మండలానికి చెందిన బ్యాంకర్లు వివరిస్తారని, దీనిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. మాదవపల్లి గ్రామాన్ని పశు వైద్యాధికారి రవికిరణ్‌ దత్తత తీసుకొని నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని గ్రామంలోని యువకులు వారి పెద్దలకు తెలియపరచాలని, అదేవిధంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌లో సభ్యులుగా ఉన్న ప్రతి రైతు నగదు రహిత లావాదేవీలపైనే ఆధారపడాలన్నారు.

రిలయన్స్‌ ఫౌండేషన్‌ మాధవపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని రైతులకు మెళకువలు సూచిస్తూ పూర్తిస్థాయిలో వ్యవసాయ గ్రామంగా తీర్చి దిద్దుతున్నారన్నారు. దీంతోపాటు మాధవపల్లి గ్రామం మండలంలోని మొట్టమొదటి నగదురహిత లావాదేవీలు జరుపుకునే గ్రామంగా నిలవాలన్నారు. తమ ఖాతాలకు సంబందించిన వివరాలను ఎవరికి తెలియపరచవద్దని సూచించారు. ప్రతి ఒక్కరికి ఆధార్‌కార్డు ఉండాలని, తక్కువ సమయంలోనే సులబంగా నగదు రహిత లావాదేవీలపై అవగాహన చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జేసి సత్తయ్య, వెటర్నరి పిడి గజరాం, జడ్పిటిసి తానాజీరావు, స్థానికసర్పంచ్‌సత్యం, ఉపసర్పంచ్‌ ఆకుల శ్రీధర్‌, ఎంపిటిసి మోతిలాల్‌, ఎండివో సాయాగౌడ్‌, తహసీల్దార్‌ లక్ష్మణ్‌, ఎడిఎ యాదగిరి, తదితరులున్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *