Breaking News

మోర్తాడ్‌కు రైలొచ్చిందోచ్‌…

 

మోర్తాడ్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కాంగ్రెస్‌ పాలనలో నత్తనడకన సాగిన రైల్వే పనులను కేంద్రంలోని ప్రధాని, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, మంత్రి బండారు దత్తాత్రేయ, రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు ప్రత్యేక చొరవ తీసుకొని అధిక నిధులు కేటాయించడమే గాకుండా పనులు సైతం పూర్తయ్యేలా చర్యలు చేపట్టడం వల్ల మోర్తాడ్‌కు రైలు చేరుకుందని బిజెపి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ అన్నారు. గురువారం జగిత్యాల్‌ వద్దగల లింగంపేట్‌ స్టేషన్‌ నుంచి 12.45 గంటలకు బయల్దేరిన పెద్దపల్లి-నిజామాబాద్‌ డెమో రైలు 2.50 నిమిషాలకు చేరుకుంది. రైల్లో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, పలువురు బిజెపి నాయకులు, రైల్వే అధికారులు ఉన్నారు. మోర్తాడ్‌లో రైలుకు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ రైల్వే బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిదులు మంజూరు కావడానికి కృషిచేసిన నేతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. తెరాస నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటయ్యాక ఎంపి కవిత పార్లమెంటులో ప్రత్యేకంగా రైల్వే నిర్మాణ పనులకు బడ్జెట్‌ కేటాయింపజేశారన్నారు. రైల్వే పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూశారన్నారు. రైల్వే బోర్డు డైరెక్టర్‌, మాజీ జడ్పిటిసి పూదరి అరుణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సి.హెచ్‌.నారాయణరెడ్డి, మండల నాయకులు రాజేశ్వర్‌, కల్లడ చిన్నయ్య, జడ్పిటిసి అనిత, పూర్ణానందం, కల్లడ ఏలియా, మండల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివె నవీన్‌ తదితరులున్నారు.

జనవరి నుంచి నిరంతరంగా రైలు కొనసాగింపు

జనవరి 1వ తేదీ నుంచి కరీంనగర్‌- మోర్తాడ్‌ నిరంతరంగా రైల్లు నడుస్తాయని స్టేషన్‌ మాస్టర్‌ కృష్ణకుమార్‌ తెలిపారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *