Breaking News

అచ్చేదిన్‌ ఎప్పుడు…

 

-డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌

నందిపేట, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం పాత్రికేయుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ మాట్లాడారు. పాత 500, 1000 నోట్లు రద్దుచేసి 50 రోజులు గడుస్తున్నా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గడం లేదని, అచ్చేదిన్‌ ఎప్పుడు వస్తాయని ప్రశ్నించారు. గతంలో పార్లమెంటులోచేసిన భూసేకరణ చట్టాన్ని దారంలేని బొంగరం వలే చట్టం చేశారని, నిండు అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడడం ఆయన సా&థయికి తగదని హితవు పలికారు. ఎన్నికల ముందు డబుల్‌ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూమి అని వాగ్దానాలు చేశారుకానీ నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 800 గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, కానీ ఆయన నియోజకవర్గంలోని ఎర్రబెల్లి గ్రామంలోనే డబుల్‌ బెడ్‌రూంలు నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. మండలంలో ఒక్క కొత్త లిఫ్టుకూడా ఏర్పాటు చేయలేదని, పాత లిఫ్టుల ద్వారానైనా సాగునీరు అందించడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌, పెంట ఇంద్రుడు, రాజిరెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌, కిషోర్‌, మహిపాల్‌, సాయికృష్ణరెడ్డి తదితరులున్నారు.

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *