Breaking News

ఆ శునకం చేసింది వింటే.. వెన్నులో వణుకు పుడుతుంది..

మంచు కురుస్తున్న చలిలో.. రైలు పట్టాల మధ్య.. గాయాలతో కదలలేని స్థితిలో ఉన్న లక్కీ అనే ఆడ శునకం. పక్కన తోడుగా పాండా అనే మగ శునకం. లక్కీ దగ్గరకు ఎవరైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తే.. పాండ పెద్దగా మొరుగుతూ తరుముతోంది. రైలు శబ్దం వినపడగానే పట్టాల మధ్యలో ఉన్నలక్కీ దగ్గరకు వెళ్లి పక్కన పడుకుంటుంది. రెండు రోజులుగా ఎన్ని రైళ్లు వాటి మీదుగా దూసుకెళ్తున్నా.. వాటికి ఏ ప్రమాదం జరగలేదు. రాత్రి పూట లక్కీ పక్కనే పడుకునేది. ఈ విషయాన్ని స్థానికులు అధికారులకు తెలియజేశారు. దీంతో వారు వైద్య బృందాన్ని పంపారు. వారు ఈ రెండు శునకాలకు వైద్యం చేసి కాపాడారు. అయితే, లక్కీ ఎలా గాయపడిందో తెలియలేదు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గాయపడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సంఘటన ఉక్రెయిన్‌లోని ఉజ్గోరాడ్‌లో జరిగింది.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *