Breaking News

Daily Archives: December 30, 2016

ఆన్‌లైన్‌ చెల్లింపులపై ప్రత్యేక శ్రద్ద వహించాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగదు రహిత లావాదేవీలకోసం అధికారులు ప్రత్యేక శ్రద్దతీసుకోవాలని, లావాదేవీలు ప్రోత్సహించేవిధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ మండలాల పరిధిలో ప్రతి గ్రామంలో నగదు రహిత లావాదేవీలు, ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగేలా ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. మండలాల్లోని ప్రధాన రహదారుల్లో కెజివీల్స్‌ ట్రాక్టర్లు నడపకుండా కఠిన ...

Read More »

అంబేడ్కర్‌ విగ్రహానికి ముదిరాజ్‌ల వినతి

  కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేపల వృత్తి ముదిరాజ్‌లదేనని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటన చేయడం దారుణమని గంగపుత్రులు అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చినిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తమ ప్రకటన విరమించుకోవాలని, చేపల వృత్తి గంగపుత్రులదని అసెంబ్లీలో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రదేశ్‌ గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు పండ్ల రాజు, ఉపాధ్యక్షుడు మహేందర్‌లు మాట్లాడుతూ తరతరాలుగా గంగపుత్రులు చేపలవృత్తిపై ఆధారపడి బతుకుతున్నారని, అలాంటి వృత్తి ...

Read More »

ఉపాధ్యాయ సమస్యలపరిష్కారానికి వినతి

  కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని తపస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డిజిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 2008, 2012 డిఎస్సీల్లో నియామకమైన ఉపాధ్యాయులకు సర్వీసు క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని ఉపాధ్యాయుల జిపిఎఫ్‌ ఖాతాలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ చేయాలని ఆ ఖాతాలను వడ్డితో సహా అప్‌డేట్‌ చేయాలని కోరారు. పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కార్యక్రమంలో తపస్‌ జిల్లా ...

Read More »

బహిరంగ విసర్జన రహిత వార్డు ఎంపిక

  కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 27వ వార్డును బహిరంగ మలమూత్ర విసర్జన రహిత వార్డుగా ఎంపిక చేసినట్టు కామారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌ విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం వార్డులోపర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో స్వచ్చ భారత్‌కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. సిబ్బంది ప్రజలకు మలమూత్ర విసర్జన ద్వారా వచ్చే రోగాల గురించి వివరించి మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రోత్సహిస్తున్నారన్నారు. 27వ వార్డులో వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తయ్యాయని ఈ ...

Read More »

ఆకట్టుకున్న సైన్స్‌ఫేర్‌

  కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వాణి విద్యాలయం హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన సైన్స్‌ ఫేర్‌ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. సైన్స్‌ ఫేర్‌లో 6- 10వ తరగతి విద్యార్థులు తాము రూపొందించిన వివిధ రకాల ప్రయోగాలు ప్రదర్శించారు. నీటి శుద్దీకరణ,నీటి ద్వారా నడిచే ప్రొక్లెయిన్‌, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే నష్టాలు, నగదు రహితం కోసం స్వైపింగ్‌మిషన్‌ తదితర అంశాలను ప్రదర్శించి వాటి గురించి వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి మాట్లాడుతూ ...

Read More »

సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలోని కాకతీయ నగర్‌ కాలనీలో శుక్రవారం సిసి రోడ్డు నిర్మాణ పనులను ఎంపిపి లద్దూరి మంగమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జడ్పి నిధులు 2 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్టు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌నిట్టు వెంకట్‌రావు, ఉపసర్పంచ్‌ రాజేందర్‌, జడ్పిటిసి మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గౌడ సంఘం వర్కింగ్‌ కమిటీ జిల్లా అధ్యక్షునిగా రాంకుమార్‌

  కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గౌడ సంఘం కామారెడ్డి జిల్లా వర్కింగ్‌ కమిటీ అధ్యక్షునిగా కామారెడ్డికి చెందిన ఎం.రాంకుమార్‌గౌడ్‌ను నియమిస్తూ సంఘం అధ్యక్షుడు సంపత్‌గౌడ్‌, జిల్లా ఇన్‌చార్జి ప్రభాకర్‌గౌడ్‌లు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని శుక్రవారం రాంకుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రాంకుమార్‌ మాట్లాడుతూ గౌడ సంఘాన్ని గ్రామ స్తాయి నుంచి రాష్ట్ర స్తాయి వరకు పటిష్టం చేయడానికి కృషి చేస్తామన్నారు.

Read More »

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌, మాగి గ్రామాల్లో పశువైద్యశాఖ ఆద్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమం నిర్వహించారు. మహ్మద్‌నగర్‌ గ్రామంలో పశువైద్యాధికారి యూనుఫ్‌ పశువులకు టీకాలువేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 7వ తేదీ వరకు మండలంలోని టీకాలువేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు 8 వేల పశువులకు టీకాలు వేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు వాజిద్‌అలీ, కాశయ్య, దఫేదార్‌విజయ్‌, తదితరులున్నారు.

Read More »

పిల్లల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం అంగన్‌వాడి కేంద్రాలను వచ్చేపిల్లలను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచాలనే ఉద్దేశంతో పౌష్టికాహార పథకాన్ని కొనసాగిస్తుందని, కొంత మంది పిల్లలు బరువుతక్కువగా ఉన్నవారు పౌష్టికాహార లోపంతో ఉన్నవారిని గుర్తించేందుకు నెలవారి 1వ తేదీ నుంచి 31 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ శ్రీలత అన్నారు. మహ్మద్‌నగర్‌ గ్రామంలో అంగన్‌వాడి టీచర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి 31 వరకు పిల్లలను పర్యవేక్షణ చేసి కేంద్రాల్లో చేర్పించాలన్నారు.

Read More »

నర్సరీ మొక్కల పరిశీలన

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా హరితహారం కార్యక్రమాన్ని వచ్చే ఏడాది పకడ్బందీగా చేపట్టేందుకు నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామని, వాటి పనులను ఎంపిడివో రాములు నాయక్‌, వైస్‌ ఎంపిపి గోగుల పండరి, సర్పంచ్‌బేగరి రాజు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ వచ్చే ఏడాది హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు అధిక సంఖ్యలో నాటేందుకు ఉపాధి హామీ ద్వారా నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం నర్సింగ్‌రావుపల్లి,సుంకిపల్లి, మాగి గ్రామాల్లో నర్సరీల్లో మొక్కలునాటేందుకు ...

Read More »

పిఆర్‌టియు క్యాలెండర్‌ ఆవిష్కరణ

  బీర్కూర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో పిఆర్‌టియు 2017 క్యాలెండర్‌ను ఎంఇవో గోపాల్‌రావు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా పిఆర్‌టియు కార్యదర్శి రవిందర్‌ మాట్లాడుతూ పిఆర్‌టియు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు. నూతన సంవత్సరంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Read More »

అస్పృశ్యత పాటించడం నేరం

  బీర్కూర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అస్పృశ్యత పాటించడం ప్రస్తుత సమాజంలో నేరమని బీర్కూర్‌ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి అన్నారు. ప్రతినెల చివరి రోజున నిర్వహించే పౌరహక్కుల దినోత్సవాన్ని బీర్కూర్‌ మండల కేంద్రంలోని చావిడిలో శుక్రవారం ఎస్‌ఐ ఆద్వర్యంలో పోలీసులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్‌ఐ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉందని, ఇతరుల హక్కులకు, స్వేచ్చకు భంగం వాటిల్లకుండా ప్రతి ఒక్క వ్యక్తి సభ్య సమాజంతో పాటు నీతిగా జీవించాలని ఆయన అన్నారు. కులాల పేరుతో ...

Read More »

ఉత్తునూరులో మరుగుదొడ్ల నిర్మాణాల పరిశీలన

  గాంధారి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం ఉత్తునూరులో మరుగుదొడ్ల నిర్మాణాలను ఎండివో సాయాగౌడ్‌ శుక్రవారం పరిశీలించారు. ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, వాటిని వినియోగంలోకి తేవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.నిర్మిస్తున్న మరుగుదొడ్లను త్వరితగతిన పూర్తిచేయాలని ఉపాధి హామీ సిబ్బందికి ఎండివో సాయాగౌడ్‌ ఆదేశించారు.

Read More »

గాంధారిలో ఐడియా 4జి సేవలు ప్రారంభం

  గాంధారి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో ఐడియా 4జి సేవలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద అయ్యప్పస్వామి భక్తులు 4జి సేవలను లాంఛనంగా ప్రారంభించారు. మెరుగైన సేవలు అందించడానికి ఐడియా దినదినంగా కస్టమర్లకు చేరువలో వస్తుందని, ఇకముందు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని ఐడియా కంపెనీ ప్రతినిదులు ఉమా శంకర్‌, పృథ్వీరాజ్‌, వెంకటేశ్‌, గాంధారి డిస్ట్రిబ్యూటర్‌ బెజుగం శ్రీధర్‌, స్వాములు అన్నారు.

Read More »

89 వ రోజుకు చేరిన రిలే దీక్షలు

  గాంధారి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలాన్ని యధావిధిగా కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 89 వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం దీక్షలో జేఏసి ప్రతినిదులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసి ప్రతినిధులు పోతంగల్‌ కిషన్‌రావు, తూరుపు రాజులు, బాల్‌రాజ్‌, బాలయ్య, లయన్‌ రమేశ్‌, శంకర్‌, జి.శంకర్‌, రెడ్డిరాజులు, మదార్‌ తదితరులు మాట్లాడుతూ గాంధారి మండలాన్ని యధావిధిగా కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని ...

Read More »

అక్రమ మైనింగ్‌ రద్దుచేయాలి

  గాంధారి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం చద్మల్‌ గ్రామంలో రైతులు సాగుచేస్తున్న భూమిలో అక్రమ మైనింగ్‌ అనుమతులు రద్దుచేయాలని అకిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. చద్మల్‌ గ్రామంలోని 121, 122 సర్వే నెంబర్లలో గల ప్రభుత్వ భూమిలో దాదాపు 16 నుంచి 20 మంది రైతులు పట్టాలు పొంది పండ పండించుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. ఇలాంటి భూమిలో ప్రభుత్వం ఎలాంటి పర్యావరణ అనుమతులు, గ్రామ పంచాయతీ తీర్మానం, ఫారెస్టు అనుమతులు లేకుండా శ్రీనివాస మైనింగ్‌కంపెనీకి అనుమతి ...

Read More »