Breaking News

అస్పృశ్యత పాటించడం నేరం

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అస్పృశ్యత పాటించడం ప్రస్తుత సమాజంలో నేరమని బీర్కూర్‌ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి అన్నారు. ప్రతినెల చివరి రోజున నిర్వహించే పౌరహక్కుల దినోత్సవాన్ని బీర్కూర్‌ మండల కేంద్రంలోని చావిడిలో శుక్రవారం ఎస్‌ఐ ఆద్వర్యంలో పోలీసులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్‌ఐ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉందని, ఇతరుల హక్కులకు, స్వేచ్చకు భంగం వాటిల్లకుండా ప్రతి ఒక్క వ్యక్తి సభ్య సమాజంతో పాటు నీతిగా జీవించాలని ఆయన అన్నారు. కులాల పేరుతో ఒకరిని దూషించడం తగదని ఆయనహెచ్చరించారు. పోలీసులు ప్రజలతో మమేకమై ఉంటున్నారని, సమస్యలుంటే పెద్ద గొడవలు చేయకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. మహిళల స్వేచ్చను ప్రతి ఒక్కరు కాపాడాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సయ్య, జడ్పిటిసి కిషన్‌ నాయక్‌, ఎంపిడివో భరత్‌కుమార్‌, గ్రామస్తులు పాల్గొన్నారు

Check Also

ప్రణాళికా బద్దంగా వ్యవసాయం చేసి లాభాలు గడించాలి

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలంలో వ్యవసాయంపై మండల‌ స్థాయి అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *