Breaking News

అంబేడ్కర్‌ విగ్రహానికి ముదిరాజ్‌ల వినతి

 

కామారెడ్డి, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేపల వృత్తి ముదిరాజ్‌లదేనని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటన చేయడం దారుణమని గంగపుత్రులు అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చినిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తమ ప్రకటన విరమించుకోవాలని, చేపల వృత్తి గంగపుత్రులదని అసెంబ్లీలో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రదేశ్‌ గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు పండ్ల రాజు, ఉపాధ్యక్షుడు మహేందర్‌లు మాట్లాడుతూ తరతరాలుగా గంగపుత్రులు చేపలవృత్తిపై ఆధారపడి బతుకుతున్నారని, అలాంటి వృత్తి తమది కాదని ముఖ్యమంత్రి ప్రకటించడం సమంజసం కాదన్నారు. తమ ప్రకటన మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రతినిదులు నర్సయ్య, రాజయ్య, నారాయణ, లక్ష్మినారాయణ, రాజన్న, దువ్వల రమేశ్‌, శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

600 మంది వల‌స కార్మికుల‌కు అన్నదానం

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా జాతీయ రహదారి 44, జంగంపల్లి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *