Breaking News

89 వ రోజుకు చేరిన రిలే దీక్షలు

 

గాంధారి, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలాన్ని యధావిధిగా కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 89 వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం దీక్షలో జేఏసి ప్రతినిదులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసి ప్రతినిధులు పోతంగల్‌ కిషన్‌రావు, తూరుపు రాజులు, బాల్‌రాజ్‌, బాలయ్య, లయన్‌ రమేశ్‌, శంకర్‌, జి.శంకర్‌, రెడ్డిరాజులు, మదార్‌ తదితరులు మాట్లాడుతూ గాంధారి మండలాన్ని యధావిధిగా కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఎల్లారెడ్డికి కనీసం రవాణా సౌకర్యం కూడా లేదని పేర్కొన్నారు. ఇకనైనా స్తానిక తెరాస ప్రజాప్రతినిధులు ఉద్యమంలోకి వచ్చి మండల ప్రజల ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *