Breaking News

ఉపాధ్యాయ సమస్యలపరిష్కారానికి వినతి

 

కామారెడ్డి, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని తపస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డిజిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 2008, 2012 డిఎస్సీల్లో నియామకమైన ఉపాధ్యాయులకు సర్వీసు క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని ఉపాధ్యాయుల జిపిఎఫ్‌ ఖాతాలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ చేయాలని ఆ ఖాతాలను వడ్డితో సహా అప్‌డేట్‌ చేయాలని కోరారు. పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కార్యక్రమంలో తపస్‌ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి రవింద్రనాథ్‌ ఆర్య, ప్రతినిధులు రాంచంద్రం, రాఘవరెడ్డి, లక్ష్మణ్‌రావు, సంతోష్‌, ఆంజనేయులు, శ్రీరాం, లక్ష్మిపతి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

600 మంది వల‌స కార్మికుల‌కు అన్నదానం

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా జాతీయ రహదారి 44, జంగంపల్లి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *