Breaking News

ఆకట్టుకున్న సైన్స్‌ఫేర్‌

 

కామారెడ్డి, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వాణి విద్యాలయం హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన సైన్స్‌ ఫేర్‌ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. సైన్స్‌ ఫేర్‌లో 6- 10వ తరగతి విద్యార్థులు తాము రూపొందించిన వివిధ రకాల ప్రయోగాలు ప్రదర్శించారు. నీటి శుద్దీకరణ,నీటి ద్వారా నడిచే ప్రొక్లెయిన్‌, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే నష్టాలు, నగదు రహితం కోసం స్వైపింగ్‌మిషన్‌ తదితర అంశాలను ప్రదర్శించి వాటి గురించి వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల వారిలో సృజనాత్మకత పెరిగి వారికి అనుకూలమైన మార్గాలు అన్వేషించుకుంటారన్నారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *