Breaking News

ఆన్‌లైన్‌ చెల్లింపులపై ప్రత్యేక శ్రద్ద వహించాలి

 

– జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ

కామారెడ్డి, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగదు రహిత లావాదేవీలకోసం అధికారులు ప్రత్యేక శ్రద్దతీసుకోవాలని, లావాదేవీలు ప్రోత్సహించేవిధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ మండలాల పరిధిలో ప్రతి గ్రామంలో నగదు రహిత లావాదేవీలు, ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగేలా ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. మండలాల్లోని ప్రధాన రహదారుల్లో కెజివీల్స్‌ ట్రాక్టర్లు నడపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నడిపితే వెంటనే సీజ్‌చేసి కేసు నమోదు చేయాలన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులను, ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో శ్మశానవాటికలకు స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు పంపాలన్నారు. రేషన్‌ సరుకులను పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాదాబైనామా దరఖాస్తులను విచారణ జరిపి వారంరోజుల్లో ప్రతిపాదనలు పంపాలన్నారు. అసైన్డ్‌ భూముల్లో లబ్దిదారులు సాగుచేస్తున్నారా లేదా అనే దానిపై విచారణ జరిపి అందుకు సంబంధించిన వివరాలు సమర్పించాలన్నారు. అనంతరం నగదు రహిత లావాదేవీలపై బ్యాంకర్లతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో జేసి సత్తయ్య, డిఆర్వో మధుమాల, ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *