Breaking News

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌, మాగి గ్రామాల్లో పశువైద్యశాఖ ఆద్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమం నిర్వహించారు. మహ్మద్‌నగర్‌ గ్రామంలో పశువైద్యాధికారి యూనుఫ్‌ పశువులకు టీకాలువేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 7వ తేదీ వరకు మండలంలోని టీకాలువేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు 8 వేల పశువులకు టీకాలు వేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు వాజిద్‌అలీ, కాశయ్య, దఫేదార్‌విజయ్‌, తదితరులున్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *