Breaking News

బహిరంగ విసర్జన రహిత వార్డు ఎంపిక

 

కామారెడ్డి, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 27వ వార్డును బహిరంగ మలమూత్ర విసర్జన రహిత వార్డుగా ఎంపిక చేసినట్టు కామారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌ విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం వార్డులోపర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో స్వచ్చ భారత్‌కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. సిబ్బంది ప్రజలకు మలమూత్ర విసర్జన ద్వారా వచ్చే రోగాల గురించి వివరించి మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రోత్సహిస్తున్నారన్నారు. 27వ వార్డులో వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తయ్యాయని ఈ క్రమంలో వార్డును బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా ప్రకటించామన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మొదటిసారిగా 27వ వార్డును ఎంపికచేసినట్టు తెలిపారు. నూతన కమిటీని నియమించామన్నారు. స్వచ్చభారత్‌ 27వ వార్డుకౌన్సిలర్‌ మాసుల లక్ష్మినారాయణ ఛైర్మన్‌గా ఉంటారని, కమిటీ సభ్యులుగా అంజయ్య, దామోదర్‌, నర్సయ్య, బాల్‌రాజయ్య, భూమయ్యలు ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో తెరాస పట్టణ అద్యక్షుడు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, ప్రతినిధులు గైని శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీకాంత్‌, సాయిలు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

కేంద్ర ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం నాల్గ‌వ ఆర్థిక ప్యాకేజీ రెండు ల‌క్షల‌కోట్లు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *