Breaking News

ఘనంగా అయ్యప్పస్వామి ఆరట్టు

 

గాంధారి, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో శనివారం అయ్యప్పస్వామి ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వామి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి గ్రామంలో ఊరేగించారు. కార్యక్రమంలో స్వాములు వివిధ వేషధారణలతో నృత్యాలుచేస్తు ఆరట్టులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభాయాత్రకు వస్తున్న రథానికి గ్రామంలోని మహిళలు, భక్తులు ఘనస్వాగతం పలికారు. రథం దారివెంబడి నీటితో శుద్దిచేశారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు మండలానికి చెందినస్వాములు పాల్గొన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *