Breaking News

కామర్స్‌ లెక్చరర్‌కి గోల్డ్‌ మెడల్‌

 

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని కేర్‌డిగ్రీ కళాశాలలో కామర్స్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న మీర్‌ నిస్సార్‌ అలీ హష్మి ఇటీవల బంగారు పతకం సాధించారు. 2013-15 విద్యాసంవత్సరానికి గాను మౌలానా ఆజాద్‌ ఉర్దూ యూనివర్సిటీ నుంచి ఎం.కాం విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఇటీవల బంగారు పతకం బహుకరించారు. ఈ సందర్భంగా కేర్‌ కళాశాలలో యాజమాన్యం, అధ్యాపక సిబ్బంది ఘనంగా సత్కరించారు. శాలువా,జ్ఞాపిక, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ మాట్లాడుతూ తమ కళాశాలలో ఓ లెక్చరర్‌ తన విద్యాభ్యాసంలో గోల్డ్‌ మెడల్‌ సాధించడం, అతను తమ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ బాలకృష్ణ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *