Breaking News

వందశాతం మరుగుదొడ్లు పూర్తి

 

మోర్తాడ్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గాండ్లపేట్‌ గ్రామంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్తానికసర్పంచ్‌రాజేశ్వర్‌ మండల అధికారుల, గ్రామస్తుల సహకారంతో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు శనివారం వరకు పూర్తిచేయించారు. అంతేగాకుండా గత రెండ్రోజులుగా గ్రామపంచాయతీలో మండల ప్రత్యేకాధికారి శంకరయ్య, ఎంపిడివో శ్రీనివాస్‌, ఐకెపి సిసి మహేందర్‌, ఇవో జావిద్‌, స్తానికసర్పంచ్‌ గ్రామస్తులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రేషన్‌ సరుకులు క్యాష్‌లెస్‌ విధానంపై తీసుకునేలా వందశాతం పూర్తిచేశారు. గ్రామంలో 158 కుటుంబాలున్నాయని, బ్యాంకు, ఆధార్‌ లింకేజీ సైతం నమోదు చేయించి నగదు రహితంగా సరుకులు తీసుకునేలా కృషి చేసినట్టు శంకరయ్య తెలిపారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *