Breaking News

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ప్రజలు నిర్వహించుకుంటున్నారు. శనివారం ఉదయం నుంచే 2016 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ విందులు, వినోద కార్యక్రమాల్లో యువత, చిన్న, పెద్ద తలమునకలయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా మాంసం విక్రయదారులకు భలే గిరాకీ పెరిగింది. శనివారం అర్ధరాత్రి కేక్‌కట్‌చేసి మిఠాయిలు పంచి 2017 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా, ఇతరుల స్వేచ్చకు భంగం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకలు జరుపుకోవాలని ఎస్‌ఐ భరత్‌కుమార్‌ తెలిపారు.

Check Also

ప్రణాళికా బద్దంగా వ్యవసాయం చేసి లాభాలు గడించాలి

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలంలో వ్యవసాయంపై మండల‌ స్థాయి అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *