Breaking News

తెవివిలో నూతన సంవత్సర వేడుకలు

 

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ బాలికల వసతి గృహంలో శనివారం 2017 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైస్‌ఛాన్స్‌లర్‌ సాంబయ్య విచ్చేసి కేక్‌కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కొత్త ఆశయాలతో, నూతన ఆలోచనలతో భవిష్యత్తు నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. వార్డెన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ స్రవంతి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలవైపు దూసుకెళ్తు మహిళా శక్తినిచాటాలని సూచించారు. కార్యక్రమంలో వసతి గృహంలోని విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *