Breaking News

వైభవంగా అయ్యప్ప ఆలయంలో పూజలు

 

కామారెడ్డి, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న మండల పూజా కార్యక్రమంలో భాగంగా శనివారం స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు సంఘం అధ్యక్షుడు చీలప్రభాకర్‌ ఇంటివద్దనుంచి స్వామివారి ఆభరణాల ఊరేగింపు నిర్వహించారు. 500 మంది స్వాములతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండాఊరేగింపు జరిపారు. 10 గంటలకు ఆలయానికి చేరుకొని హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం 2 వేల మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. లింగన్నపేట, సంస్కృతిపాఠశాల నిర్వాహకుడు రాధాకృష్ణ స్వామి ఆధ్వర్యంలో పూజలు జరిపారు. రాత్రివేళ పుష్పాభిషేకం, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు చీల ప్రభాకర్‌, ప్రతినిదులు ఉదయ్‌, శ్రీనివాస్‌, శ్రీధర్‌, ముప్పారపు ఆనంద్‌, రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

600 మంది వల‌స కార్మికుల‌కు అన్నదానం

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా జాతీయ రహదారి 44, జంగంపల్లి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *