Breaking News

సావిత్రిబాయి పూలే జయంతి కరపత్రాల ఆవిష్కరణ

 

కామారెడ్డి, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే 185వ జయంతి వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను శనివారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ అంబేడ్కర్‌ సంఘం జిల్లా అడ్‌హక్‌ కమిటీ కన్వీనర్‌ ఆకుల బాబు, గౌరవ అద్యక్షుడు కొత్తపల్లి మల్లయ్యలు మాట్లాడుతూ కామారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో ఈనెల 3వ తేదీన జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నిజామాబాద్‌, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువడ, ఆర్మూర్‌, బోధన్‌లలో జయంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనికి అన్ని వర్గాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగి మోహన్‌, అంజద్‌, భూంరెడ్డి, నాయకులు రాజలింగం, పిట్ల వేణు, నరేందర్‌, సాయిలు, రాజు, శివరాం, రాజవర్ధన్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డిలో స్వాగత తోరణం

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో ప్రధాన రహదారి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *