Breaking News

విద్యార్థులు తెలంగాణ భవిష్యత్తు వారసత్వ సంపద

 

– ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ

కామారెడ్డి, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ భవిష్యత్తు వారసత్వ సంపద విద్యార్థులని ప్రముఖ వాగ్గేయకారుడు డాక్టర్‌ అందెశ్రీ అన్నారు. కామారెడ్డి మండలంల చిన్నమల్లారెడ్డి గ్రామంలోని చైతన్య విద్యానికేతన్‌ పాఠశాలలో 2016 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2017 కుస్వాగత కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అందెశ్రీ మాట్లాడుతూ కామారెడ్డిని జిల్లాగా ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్దికి జిల్లాల పునర్విభజన తోడ్పడుతుందన్నారు. తను రాసిన జయజయహే తెలంగాణ గీతంలో ‘పది జిల్లాల మీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం’ అనే స్థానంలో పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన అని పాడుకోవాలని సూచించారు. తెలంగాణ 31 జిల్లాలతో కెసిఆర్‌ నాయకత్వంలో అభివృద్ది చెందుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను తనపాటలతో ఉర్రూతలూగించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో విద్యార్థులు తమవంతు పాత్ర పోషించాలని, సమైక్యరాష్ట్రంలో పోగొట్టుకున్న చదువులు, కొలువులను స్వరాష్ట్రంలో సాధించుకోవాలన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు సిరిమల్లె విష్ణుకిషోర్‌, కవి శంకర్‌, గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్‌ ఆనంద్‌రావు, సలహాదారు సుమిత్రానంద్‌, ప్రధానోపాధ్యాయులు గంగరాజు, యాదగిరి, తదితరులున్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *