Breaking News

తెలంగాణ జాగృతి క్రికెట్‌ కప్‌ ఆవిష్కరణ

 

కామారెడ్డి, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో జనవరి 7వతేదీ నుంచి 12 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాగృతి క్రికెట్‌కప్‌-2017ను హైదరాబాద్‌లో నిజామాబాద్‌ ఎంపి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. క్రికెట్‌ మ్యాచ్‌లు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరుగుతాయని, మన జోన్‌ నుంచి 24 టీంలు క్రికెట్‌ మ్యాచ్‌లో పాల్గొంటాయన్నారు. కామారెడ్డి జోన్‌లోని విన్నర్‌టీం, నిజామాబాద్‌ జోన్‌ టీంతో తలపడుతుందన్నారు. అందులో నెగ్గిన టీం ఈనెల 23న హైదరాబాద్‌ ఎల్‌బిస్టేడియంలో జరిగే మ్యాచ్‌లో తలపడుతుందన్నారు. విన్నర్‌ టీంకు 30 వేల నగదు, రన్నర్‌ టీంకు 15 వేల నగదు జోనల్‌ సస్థాయిలో అందజేయనున్నట్టు తెలిపారు. గ్రాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ విన్నర్‌కు 3 లక్షల నగదు, రన్నరప్‌కు 1.5 లక్షల నగదు అందజేస్తారని తెలిపారు. జనవరి 2 వ తేదీ నుంచి ఇందుకోసం టీంలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జాగృతి కన్వీనర్‌ హరీష్‌ తెలిపారు. వివరాలకు 9494393978, 8143616533 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *