Breaking News

Monthly Archives: January 2017

పించన్‌ దారులుబ్యాంకు ఖాతాలు అందజేయాలి

  గాంధారి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పింఛన్లు పొందుతున్న వారు వారికి సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాలను పంచాయతీ కార్యదర్శులకు అందజేయాలని గాంధారి ఎండివో సాయాగౌడ్‌ సూచించారు.వృద్దాప్య, వితంతు, వికలాంగులు, బీడీ కార్మికులు జీవన భృతి పొందుతున్నవారు తమకు సంబంధించిన ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకం జిరాక్సులు, పింఛన్‌ వివరాలు ఆయా గ్రామాల కార్యదర్శులకు రెండు, మూడురోజుల్లో అందజేయాలన్నారు. ఇకనుంచి నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్‌ డబ్బులు జమచేయబడతాయని కావున అందరుతప్పకుండా జిరాక్సు ప్రతులను అందజేయాలని సూచించారు.

Read More »

కొనసాగుతున్న పోలియో చుక్కల పంపిణీ

  గాంధారి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో పోలియో చుక్కల పంపిణీ కొనసాగుతుంది. మూడోరోజు మంగళవారం ఉత్తునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్‌ షాహెద్‌ అలీ సిబ్బందితో కలిసి మండలంలోని ప్రయివేటు పాఠశాలలు, అంగన్‌వాడి కేంద్రాలలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలియో ఆదివారం కార్యక్రమంలో పోలియోచుక్కలు వేయించుకోని 0-5 సంవత్సరాలలోపు చిన్నారులను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయించారు. మొత్తం 100 శాతం పోలియో చుక్కల పంపిణీ జరిగేంత వరకు అన్ని గ్రామాల్లో పర్యటిస్తామని డాక్టర్‌ ...

Read More »

వందశాతం ఇంటి పన్ను వసూలే లక్ష్యంగా పనిచేయాలి

  గాంధారి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వందశాతం ఇంటిపన్ను వసూలే లక్ష్యంగా పనిచేయాలని కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి డి.రాములు అన్నారు. మంగళవారం గాంధారి గ్రామ పంచాయతీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 14 కోట్ల 93 లక్షల రూపాయలు ఇంటిపన్ను రూపంలో బకాయిలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 5 కోట్ల 4 లక్షల వరకు వసూలయ్యాయని, వందశాతం వసూళ్లకు సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు సహకరించాలన్నారు. జిల్లాలోని ఆయా ...

Read More »

పాఠశాల అభివృద్ది ప్రణాళికపై శిక్షణ

  గాంధారి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, విద్యాభివృద్ది ప్రణాళికపై పాఠశాల యాజమాన్య కమిటీలు, ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గాంధారి మండల కేంద్రంలోని ఎండివో కార్యాలయంలో మంగళవారం ఎస్‌ఎంసి ఛైర్మన్లు, కన్వీనర్లు, మెంబర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంఇవో సేవ్లానాయక్‌ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ ఎస్‌ఎంసి కమిటీలు రెండు సంవత్సరాల పాటు కొనసాగుతాయన్నారు. పాఠశాలలో విద్యాభివృద్ది, మధ్యాహ్న భోజనం వంటి విషయాలపై ఎస్‌ఎంసి కమిటీలు పర్యవేక్షిస్తాయని ...

Read More »

డైనింగ్ టేబుల్‌ గురించి కోహ్లీ సేనను హెచ్చరించిన సచిన్

ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోహ్లీ సేనను హెచ్చరించాడు. ఫిట్‌నెస్ సాధించేందుకు డైనింగ్ టేబుల్ వద్ద సమయాన్ని తగ్గించి జిమ్‌లో ఎక్కువ సమయం గడపాలని సూచించాడు. ఇదంతా రాబోయే ఆస్ట్రేలియా పర్యటన గురించి సచిన్ చేసిన వ్యాఖ్యలు. స్మిత్ నేతృత్వంలోని ఆసిస్ జట్టును తక్కువ అంచనా వేయవద్దని, ఏ మాత్రం అవకాశమిచ్చిన వారు కోలుకోనివ్వరని టీమిండియాకు సూచించాడు. అయితే తనకు టీమిండియాపై నమ్మకం ఉందని, భారత జట్టే ఫేవరెట్ అని అన్నాడు సచిన్.

Read More »

రోడ్డుమీద చచ్చిపోతుంటే.. ఫొటోలు తీసుకున్నారు!

ప్రమాదంలో గాయపడి సీఐ మృతి ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జీపు.. బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇన్‌స్పెక్టర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై పడి.. తీవ్ర రక్తస్రావంతో గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్నవారు చు ట్టూ చేరారు. కానీ, అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందు కు కాదు.. ఆ దృశ్యాన్ని సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసుకునేందుకు! దాదాపు అరగంటకు పైగా ఏ ఒక్కరూ స్పందించలేదు. చివరికి పోలీసు అధికారులు అక్కడి కి వచ్చి.. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. సాటి మనిషి ప్రాణాలు కోల్పోతున్నా.. మానవత్వం ...

Read More »

అమెరికా వీసా బాంబు?

ఉద్యోగులు, విద్యార్థులే ట్రంప్‌ టార్గెట్‌ – ‘చట్టబద్ధ వీసా’ల పైనా – అమెరికా అధ్యక్షుడి గురి – వీసా నిబంధనల సమీక్ష, – అమలు తీరుపై తనిఖీలు – కొత్త నిబంధనలతో – ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ సిద్ధం ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం, మంచి జీవితం.. కారణమేదైనా తొలి చూపు అమెరికావైపే.. ఎన్నో ఆశలతో అమెరికా వైపు చూసే వారందరి కలలపై ఆ దేశ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బాంబు వేయనున్నారు. రాబోయే వారిపైనే కాదు.. ఇప్పటికే చట్టబద్ధంగా హెచ్‌1బీ, ఎల్‌1, ఎఫ్‌1 ...

Read More »

ఎంబీబీఎస్‌లో.. మాస్‌ కాపీయింగ్‌?

 ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందా? విద్యార్థులు, ఫ్రొఫెసర్లు కుమ్మక్కయ్యారా? మాస్‌ కాపీయింగ్‌కు లక్షల్లో చేతులు మారాయా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్రంలో రెండు ప్రధాన వైద్య కళాశాలల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతున్నట్లు కొందరు ఆరోగ్యశాఖ మంత్రితో పాటు హెల్త్‌ వర్సిటీ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది. వెంటనే స్పందించిన మంత్రి.. వర్సిటీ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో వర్సిటీ అధికారులు విషయం బయటకు పొక్కకుండా రహస్యంగా 2 బృందాలను నియమించారు.      అంతేకాకుండా హైదరాబాద్‌లోని ఓ ...

Read More »

బాహుబలి-2 పోస్టర్‌లో నెటిజన్లు ఎంచిన తప్పు!

బాహుబలి సినిమాతో విజువల్ వండర్ సృష్టించిన రాజమౌళి.. బాహుబలి-2 సినిమాతో దానికి డబుల్ ధమాకాను సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటోంది. ఏప్రిల్ 28న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే అంతకన్నా ముందే ఇటీవల బాహుబలి-2 సినిమా పోస్టర్‌ను విడుదల చేశాడు జక్కన్న. సోషల్ మీడియాలో ఆ పోస్టర్‌కు మంచి ఆదరణే లభించినా.. అదే స్థాయిలో ఆ పోస్టర్‌లో తప్పులెంచుతున్నారు నెటిజన్లు. ఇంతకీ బాహుబలి-2 పోస్టర్‌లో ఉన్న ఆ తప్పేంటి? పోస్టర్‌ను ఒక్కసారి సరిగ్గా గమనిస్తే.. ఆ ...

Read More »

మెగా ఫ్యామిలీకీ బన్నీ దూరం జరుగుతున్నాడా?

మెగా ఫ్యామిలీ అంటూ బయటకు అందరూ ఒకే వేదికపై నవ్వుతూ కనబడుతున్నా.. అంతర్గతంగా వారి మధ్య విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. చిరంజీవి-పవన్‌, బన్నీ-పవన్‌, చరణ్‌-బన్నీల మధ్య విభేదాల గురించి ఇంతకు ముందే ఎన్నో వార్తలు వచ్చాయి. అభిమానులపరంగా కూడా వారికి డిఫరెన్సెస్‌ ఉన్నాయి. ఇప్పటికే పవన్‌కు దూరంగా ఉంటున్న బన్నీ.. తాజాగా రామ్‌చరణ్‌కూ దూరమయ్యాడని టాక్‌. అందుకే బన్నీ తనకోసం సెపరేట్‌గా పీఆర్‌ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు టాక్‌ వినిపిస్తోంది. ఇకపై ఫ్యాన్స్‌మీట్‌ను ఈ టీమే ఆర్గనైజ్‌ చేస్తుందట. బన్నీ తమ్ముడు అల్లు ...

Read More »

టివియువి శిక్షణ సదస్సు గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక టివియువి సదస్సుకు సంబంధించిన గోడప్రతులను సోమవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టివియువి రాష్ట్ర ఉపాధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్‌యాదవ్‌, రజనీకాంత్‌లు మాట్లాడుతూ ఫిబ్రవరి 4న టివియువి ఆధ్వర్యంలో ఓయులో శిక్షణ సదస్సు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి ఆచార్య కోదండరాం హాజరవుతారని తెలిపారు. సదస్సులో రాష్ట్ర అభివృద్దిలో విద్యార్థుల పాత్ర, నిరుద్యోగ సమస్య, విద్యార్థి ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, యూనివర్సిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం తదితర వాటిపై చర్చిస్తామన్నారు. ...

Read More »

కామారెడ్డి ఉపాధ్యాయునికి ఉత్తమ అవార్డు

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని భవిత పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ప్రభుకు ఉత్తమ అధ్యాపక అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తెలంగాణ ప్రయివేటు లెక్చరర్ల అసోసియేషన్‌, శ్రీనివాస రామానుజన్‌ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అబ్దుల్‌ కలాం పేరిట పురస్కారాలు అందజేస్తున్నారు. ఈపురస్కారం తనకు లభించడం పట్ల ...

Read More »

ఘనంగా మార్కండేయుని జయంతి

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రుషి మార్కండేయ జయంతి వేడుకలు పద్మశాలీలు ఘనంగా నిర్వహించారు. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్నేహ పురి కాలనీలోగల మార్కండేయ ఆలయ ప్రాంగణంలోఉత్సవాలు జరిపారు.ఈ సందర్భంగా గాయత్రీ యజ్ఞం నిర్వహించారు. పద్మశాలీ దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. అనంతరం మహిళా సభ్యులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వేరు వేరు విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం పసుపుబొట్టు కార్యక్రమం అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ...

Read More »

మహాత్మునికి ఘన నివాళి

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో సోమవారం మహాత్మాగాంధీ 69వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, పాఠశాలలో గాంధీజి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో కలెక్టర్‌ సత్యనారాయణతోపాటు జేసి సత్తయ్య, డిఆర్వో మణిమాల ఇతర అధికారులు గాంధీజి చిత్రపటానికి పూలమాలలువేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఉప్పు ...

Read More »

యువకుని ఆత్మహత్య

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన నంగునూరి ఆనంద్‌కుమార్‌ (31) అనే యువకుడు మానసిక వేదనతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్టు పట్టణ ఎస్‌ఐ శోభన్‌ తెలిపారు. ఆనంద్‌ కొన్నేళ్ళుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడన్నారు. ఆర్థికంగా నిలబడలేకపోవడం, వ్యాపారంలో నష్టం రావడంతో ఇటీవల మెడికల్‌ ఏజెన్సీలో చేరాడు. అయినా కూడా ఆర్థిక పరిస్థితి కుదుట పడకపోవడంతో మరింత మానసిక వేదనకు గురయ్యాడు. ఇటీవలే మానసిక వైద్యున్ని సంప్రదించినట్టు కుటుంబీకులు తెలిపారు. సోమవారం ఉదయం ఎవరు లేనిసమయంలో ...

Read More »

మహాత్మునికి ఘన నివాళి

  గాంధారి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతిపిత మహాత్మాగాంధీ వర్దంతి సందర్భంగా ఆయనకు గాంధారి మండలప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ కార్యాలయంలో సదాశివనగర్‌ సిఐ శ్రీశైలం, ఎస్‌ఐ రాజేశ్‌, పోలీసులు ఉదయం 11 గంటలకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం గాంధీజి విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా అన్ని ప్రబుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది బాపూజీ వర్ధంతి సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి ...

Read More »

ప్రమాదస్థలాన్ని పరిశీలించిన సిఐ

  గాంధారి జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం బూర్గుల్‌ గ్రామం వద్ద ఇటీవల జరిగిన ప్రమాదస్థలాన్ని సదాశివనగర్‌ సిఐ శ్రీశైలం సోమవారం పరిశీలించారు. ఇటీవల బూర్గుల్‌ గ్రామ శివారులో రోడ్డుపై ఐచర్‌ వాహనం వేగంగా వెళ్లి ద్విచక్ర వాహనాన్ని ఢీకొందని దీనిపై కేసు నమోదుకాగా స్థానిక ఎస్‌ఐ రాజేశ్‌ గ్రామస్తులతో కలిసి సంఘటన స్థలాన్ని సిఐ పరిశీలించారు. వారి వెంట ఆర్‌అండ్‌బి అధికారులు తదితరులున్నారు.

Read More »

ప్రతిభా కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి

  గాంధారి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండలంలో 10వ తరగతి చదువుతున్న గిరిజన బాలబాలికలు ప్రతిభ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ బలరాం తెలిపారు. ఈ విద్యాసంవత్సరం 10వ తరగతి చదువుతున్న గిరిజన బాలురు, బాలికలు మాత్రమే ప్రతిభ కళాశాలలో ప్రవేశాలకు అర్హులని, ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇందుకోసం ఈనెల 31 చివరి తేదీ అని గిరిజనులకు ఎలాంటి రుసుము అవసరం లేదన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ఫోటో, ఆధార్‌కార్డు, సంతకం జతచేసి దరఖాస్తు ...

Read More »

పోలియో చుక్కల వివరాల సేకరణ

  గాంధారి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియో ఆదివారం విజయవంతమైనందున రాష్ట్ర వైద్యశాఖ పరిశీలకుడు డాక్టర్‌ సంపత్‌ సోమవారం గాంధారిలో పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని ఉత్తునూరు, వజ్జేపల్లి, బూర్గుల్‌, గాంధారి, వన్రికల్‌ తాండా, రాంలక్ష్మణ్‌పల్లి తదితర గ్రామాల్లో పర్యటించి పోలియో చుక్కలు వేయించుకున్న పిల్లల వివరాలు సేకరించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌ను పరిశీలించారు. మండలంలో మొత్తం 9811 ఇళ్లకు గాను 9450 ఇళ్లలో గల చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ...

Read More »

పాఠశాల నిర్వహణ తీరుపై సమావేశం

  గాంధారి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల నిర్వహణ తీరు, మధ్యాహ్న భోజనంపై పాఠశాల యాజమాన్య కమిటీ, ప్రధానోపాధ్యాయులకు సోమవారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గాంధారి మండల కేంద్రంలోని ఎండివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఇవో సేవ్లానాయక్‌ మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజనం వంటి విషయాల్లో ఎస్‌ఎంసి కమిటీలు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే సమావేశంలో తెలియజేయాలన్నారు. అదేవిధంగా సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. పాఠశాలలో విద్యాభివృద్దికి ప్రభుత్వ తోడ్పాటును రిసోర్సు పర్సన్‌లు ...

Read More »