Breaking News

‘ఖైదీ 150’ సెట్లో గొడవ పడిన క్యాథరిన్ ఇప్పడు బాధపడుతోందట

పబ్లిసిటీ కోసం హీరోయిన్లు రకరకాల స్టంట్లు చేస్తుంటే క్యాథరిన్‌ మాత్రం ఫ్రీగా వచ్చే పబ్లిసిటీని చేజేతులా వదులుకుంది అంటున్నారు సినీజనాలు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ‘ఖైదీ నంబర్‌ 150’లో ఐటెంసాంగ్‌ కోసం ముందు క్యాథరిన్‌ అనుకున్నారు. సెట్లో జరిగిన గొడవలతో క్యాథరిన్‌ ఆ పాట నుంచి తప్పుకుంది. దాంతో ఆ ఛాన్స్‌ లక్ష్మీరాయ్‌కి దక్కింది. ఇదంతా పాత కథే! ఇప్పుడు కొత్త కథ ఏమిటంటే ఈ సినిమా పబ్లిసిటీలో ఈ పాటను, అందులో లక్ష్మీరాయ్‌ డ్యాన్స్‌ను బాగా ప్రమోట్‌ చేస్తున్నారట! దీంతో లక్ష్మీరాయ్‌కి ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చేస్తోంది. లక్ష్మీరాయ్‌కి వస్తున్న పబ్లిసిటీ చూసి క్యాథరిన్‌ కూడా బాధపడుతోందట! కొద్దిగా సర్దుకుని పోయుంటే ఆ పబ్లిసిటీ అంతా తనకే దక్కి ఉండేది కదా అని మధనపడిపోతోందట!

అంతే మరి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే మరి అంటున్నారు సినీ జనాలు.

Check Also

కనుమరుగవుతున్న పండుగలు

16.01.1   నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి వచ్చిందే తుమ్మెద… సరదాలు తెచ్చిందే ...

Comment on the article