Breaking News

క్యాన్సర్‌పై అవగాహన సదస్సు

 

కామారెడ్డి, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం రేడియేషన్‌ అంకాలజిస్టు డాక్టర్‌ సంజీవ్‌ కె.గుప్త ఆధ్వర్యంలో క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యాధికి సంబంధించి, వ్యాధికి ముందు లక్షనాలు ఎలా ఉంటాయి, దానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార పదార్థాలు,మానివేయాల్సిన ఆహారపదార్థాలు, పానీయాల గురించి సూచనలు చేశారు. దీనికి సంబంధించి కంప్యూటర్‌ద్వారా రిటైర్డ్‌ ఉద్యోగులకు వివరించారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు భద్రయ్య, అధ్యక్షుడు విఠల్‌రావు, ప్రతినిధులు ప్రతాప్‌రెడ్డి, కుత్బుద్దీన్‌, వెంకటి, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *