Breaking News

కామ్రేడ్‌ సాయిలు 21 వ వర్ధంతి సభ

 

నందిపేట, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలభారత రైతుకూలీ సంఘం నందిపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సావులం సాయిలు 21వ వర్ధంతి సభ బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు కె.గంగాధర్‌ మాట్లాడుతూ కామ్రేడ్‌ సాయిలును 1996లో అర్ధరాత్రి నక్సలైట్లు అతి కిరాతకంగా గొడ్డళ్లలో నరికి చంపేశారని, సాయిలు భూస్వామి, పెట్టుబడిదారుడు కానప్పటికి ఎందుకు చంపారో సమాధానం రాలేదని అన్నారు. ప్రజానాయకులను ఈవిధంగా చంపడం సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్బంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు రాజలింగం, అనంతరావు, గిరి, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలంగాణ తిరుమల ఆలయ హుండీ లెక్కింపు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో సోమవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *