Breaking News

కార్మిక చట్టాల అమలుకై ఉచిత న్యాయసేవలందిస్తాం

 

కామారెడ్డి, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మిక చట్టాల అమలుకోసం పేదవారికి ఉచిత న్యాయసేవలందిస్తామని న్యాయమూర్తి ఎం.ఎ. సలీం అన్నారు. కామారెడ్డి పట్టణంలో బుధవారం తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్మిక చట్టాలు వాటి అమలుపై జిల్లా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మిక చట్టాల అమలు జరగడం లేదని, కార్మికులకు చట్టాలపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. అందరు కార్మికులు దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. లక్షలోపు ఆదాయం కలిగిన కార్మికులకు ఉచిత న్యాయసేవలందిస్తామని తెలిపారు. పిఏకెఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఉప్పల హనుమాన్‌ చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాగౌడ్‌, ఉపాధ్యక్షుడు హన్మంత్‌గౌడ్‌లు మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులందరు సంఘటితమై పోరాడినపుడే హక్కులు సాధించుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు నాగార్జున, సాయన్న, సత్యం, బీమేశ్‌, సాయిరెడ్డి, కృష్ణచారి, రాములు, భూపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలంగాణ తిరుమల ఆలయ హుండీ లెక్కింపు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో సోమవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *