Breaking News

ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయాలి

 

గాంధారి ప్రజల డిమాండ్లు సరియైనవే

గాంధారి, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవద్దని రాజకీయ జేఏసి ఛైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. గాంధారి మండలాన్ని కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజల ఆకాంక్ష మేరకుప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, ఎలాంటి ముసాయిదా లేకుండానేమండలాలు, డివిజన్‌లు, జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు. కొన్నిచోట్ల ఎలాంటి ప్రజాభిప్రాయం సేకరించకుండానే మండలాలను తొలగించి వేరే డివిజన్‌లలో కలిపారన్నారు. ఇందులో భాగంగానే గత 50 సంవత్సరాలుగా కామారెడ్డి డివిజన్‌లో కొనసాగుతున్న గాంధారి మండలాన్ని ఎల్లారెడ్డిలో కలిపారన్నారు. రాత్రికి రాత్రి మండల ప్రజల అభిప్రాయాలుగాని, గ్రామ సంఘాల తీర్మానాలు లేకుండానే మండలాన్ని డివిజన్‌ మార్పు చేయడం చట్టరీత్యా వ్యతిరేకమన్నారు. ప్రజలను సంప్రదించకుండా భౌగోళిక మార్పులు చేయడం చెల్లదని స్పష్టం చేశారు. ప్రజలు తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. 1974లో జిల్లాల ఏర్పాటుకు ప్రత్యేక చట్టం వచ్చిందని, ఆ సమయంలో కేవలం ప్రకాశం, రంగారెడ్డి జిల్లాలు మాత్రమే ఏర్పడడం ద్వారా ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ప్రస్తుతం 1984లో వచ్చిన చట్టం ప్రకారం ప్రజల అభిప్రాయం ప్రకారమే పునర్విభజన జరగాల్సి ఉండగా అలాంటివి ఎక్కడా జరగకుండా ఉండాయన్నారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయం వల్ల ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు జరుగుతున్నాయని , ఇప్పటికైనా ప్రభుత్వం ఆయా ప్రదేశాల్లో ఉన్న ప్రజల ఆకాంక్షను తీర్చేవిధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రిలేదీక్షలు చేపట్టి 101 రోజులు అయిన సందర్భంగా దీక్షలు నిలిపివేయాలని, మండల డిమాండ్‌ను ప్రభుత్వానికి సూచిస్తామని జేఏసి నాయకులకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కార్యక్రమంలో కామారెడ్డి రాజకీయ జేఏసి కన్వీనర్‌ జగన్నాథం, పురుషోత్తం, రమేశ్‌, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎంపిపి ఆకుల శ్రీనివాస్‌, జేఏసి ప్రతినిదులు పోతంగల్‌ కిషన్‌రావు, తూరుపు రాజులు, బాల్‌రాజ్‌, బాలయ్య, లయన్‌ రమేశ్‌, శంకర్‌, జి.శంకర్‌, రెడ్డిరాజులు, మదార్‌ తదితరులున్నారు. మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *